సబ్‌కలెక్టర్‌పై ఎమ్మెల్యే ఫిర్యాదు

సబ్‌కలెక్టర్‌పై ఎమ్మెల్యే ఫిర్యాదు

కృష్ణా జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, సబ్ కలెక్టర్ మిషాసింగ్ మధ్య వివాదం ముదిరింది. రైతు పంట చేను కోసం మురుగు కాల్వ చదును చేస్తే వాల్టా చట్టం కింద కేసు నమోదు ఎలా చేస్తారని ఎమ్మెల్యే ఆగ్రహం చేస్తుండగా.. అధికారులు సీజ్ చేసిన ప్రొక్లెయినర్‌ను ఎమ్మెల్యే పంపించేశారని.. దాన్ని అప్పగించాలని సబ్ కలెక్టర్ డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా.. తన కార్యాలయానికి పోలీసులను తీసుకొచ్చి గంటపాటు సబ్ కలెక్టరు హల్ చల్ చేయడంపై బోడె అసహనంతో ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సబ్‌కలెక్టర్‌పై ఎమ్మెల్యే బోడె.. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుకుడకు సబ్ కలెక్టర్ పై ఫిర్యాదు చేయనున్నారు.