మోడీ సన్నాయికి జగన్, పవన్ ఆట

మోడీ సన్నాయికి జగన్, పవన్ ఆట

ప్రధాన మంత్రి మోడీ సన్నాయి వూదుతుంటే...  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆడుతున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు.  రేపు తెలంగాణ లో జరిగే ఎన్నికలు ఎంతో కీలకంగా మారబోతున్నాయని ఆయన విజయవాడ అభిప్రాయపడ్డారు.  జనసేన, వైఎస్సార్ పార్టీలు అంతర్గతంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. బీజేపీ కారణంగా  ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని ఆరోపించారు. వైసీపీ, జనసేన, ప్రత్యేక హోదాకి అడ్డుపడే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ పట్ల గౌరవం వుంటే చట్ట సభలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని అవమానిస్తే అంబేద్కర్ ని అవమనించినట్టేనని ఆయన స్పష్టం చేశారు.