ప్రధాని ఆంధ్రా పర్యటనపై నిరసనల వెల్లువ

ప్రధాని ఆంధ్రా పర్యటనపై నిరసనల వెల్లువ

ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై నిరసన జ్వాలలు ఎగసి పడుతున్నాయి. పోస్టర్లు, బ్యానర్లు, సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ లు.. ఒకటేంటి? అన్ని విధాలుగా ప్రధాని మోడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా  ‘గో బ్యాక్ మోడీ’, ‘మోడీ ఈజ్ ఎ మిస్టేక్’ అనే నినాదాలతో బ్యానర్లు, పోస్టర్లు, హోర్డింగ్స్ దర్శనమిస్తున్నాయి. ఈ పోస్టర్ల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇవి చివరికి వైరల్ మారాయి. ఆదివారం ఉదయం ‘#GoBackModiAndhra’ అనే హ్యాష్ ట్యాగ్ భారత్ ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ గా మారింది.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒకానొక పోస్టర్ లో నరేంద్ర మోడీని ఒక క్యారికేచర్ గా చూపించారు. ఆ పోస్టర్ లో జనం #NoMoreModi(ఇంక మోడీ వద్దు), #ModiIsAMistake (మోడీ ఓ తప్పు) అనే నినాదాలు చేస్తుంటే మోడీ పారిపోతుంటారు. ఆ పోస్టర్ పై ప్రధానమంత్రి క్యారికేచర్ పై ‘Modi never again’ (ఇంకెప్పుడూ మోడీ వద్దు) అని రాసి ఉంది. 

నిన్న అస్సాం పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రికి పౌరసత్వ సవరణ బిల్లుని వ్యతిరేకిస్తున్న అక్కడి ప్రదర్శనకారులు నల్ల జెండాలతో స్వాగతించిన తన నిరసన తెలియజేశారు.