చంద్రబాబుకు ఫరూఖ్ అబ్దుల్లా సంఘీభావం

చంద్రబాబుకు ఫరూఖ్ అబ్దుల్లా సంఘీభావం

ఢిల్లీ వేదికగా చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు నేషనల్ కాన్ఫరెన్స్‌ పార్టీ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా సంఘీభావం తెలిపారు. దీక్షా ప్రాంగణానికి వచ్చిన ఆయనకు ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబును కలిసి వేదికపై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ కు నీతులు చెబితే సరిపోదు.. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అని డిమాండ్ చేశారు. మోడీ విభజించు.. పాలించు.. తరహా వ్యూహం రచిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రధాని మోడీ వ్యక్తిగత దూషణలకు దిగుతూ, తన స్ధాయిని దిగజార్చుకుంటున్నారని మండిపడ్డారు. దేశం బాగుపడాలంటే.. మోడీ గద్దె దిగాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు అందర్ని కలిపేందుకు కృష్టి చేస్తున్నారని ఫరూఖ్ కొనియాడారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఫరూఖ్ అబ్దుల్లా ఆరోపించారు.