మోడీ గుంటూరు పర్యటన షెడ్యూల్‌ ఇదే..

మోడీ గుంటూరు పర్యటన షెడ్యూల్‌ ఇదే..

ప్రధాని మోడీ రేపు ఏపీలో పర్యటించనున్నారు. ఈమేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గుంటూరులో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 

  • ఉదయం 10.45 కు మోడీ విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు
  • హెలికాప్టర్‌లో 11.05 కు గుంటూరుకు వెళ్తారు
  • 11.10 కి గుంటూరు హెలిపాడ్‌ నుంచి బయలుదేరి 11.15 కు గుంటూరులోని యెటుకురు బైపాస్‌ రోడ్డుకు చేరుకుంటారు
  • 11.20 వరకు అక్కడ మాట్లాడతారు
  • 11.20 నుంచి 11.25 వరకు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. కృష్ణపట్నంలో నిర్మించే బీపీసీఎల్‌ కోస్టల్‌ టెర్మినల్‌కు భూమి పూజ చేస్తారు.
  • 11.30కి గుంటూరులో జరిగే పబ్లిక్‌ మీటింగ్‌లో పాల్గొంటారు
  • 2.25కు గుంటూరులో హెలిపాడ్‌ వద్దకు చేరుకుంటారు.
  • 12.30కు హెలికాప్టర్‌లో బయలు దేరి 12.50కి విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తారు.