ఇవాళే ఏపీకి మోడీ.. షెడ్యూల్ ఇదీ..

ఇవాళే ఏపీకి మోడీ.. షెడ్యూల్ ఇదీ..

ప్రధాని మోడీ ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. ఈమేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గుంటూరులో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రధాని హోదాలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన ఏపీకి రావడం ఇదే తొలిసారి. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ గన్నవరం విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలుకుతారు. గుంటూరు నగర శివారులోని బుడంపాడు జాతీయ రహదారి సమీపంలోని బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తారు. తూర్పు గోదావరి, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు గుంటూరు నుంచే రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.

ప్రధాని టూర్‌ షెడ్యూల్‌ ఇదీ..

 • 10.45: గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గుంటూరుకు బయలు దేరుతారు
 • 11.05: గుంటూరులో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ వద్దకు చేరుకుంటారు
 • 11.10: హెలిపాడ్‌ నుంచి ఏటుకూరు బైపాస్‌ రోడ్డులోని బహిరంగ వేదిక సభాస్థలికి వెళ్తారు
 • 11.15: కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ వేదిక వద్దకు చేరుకుంటారు
 • 11.20 - 11.25: రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా రూ.7,000 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఓఎన్‌జీసీ, ప్రెటోలియం శాఖ అనుబంధ సంస్థ చేపట్టిన రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. మరో రూ.2,280 కోట్లతో బీపీసీఎల్‌ సంస్థ కృష్ణపట్నం పోర్టులో కోస్టల్‌ టర్మినల్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.
 • 11.30: ప్రారంభోత్సవ కార్యక్రమాల వేదిక నుంచి బయలుదేరి బీజేపీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు
 • 11.30 - 12.15: బహిరంగ సభలో పాల్గొంటారు
 • 12.20: బహిరంగ వేదిక సభాస్థలి నుంచి బయలుదేరుతారు
 • 12.25: గుంటూరులోని హెలిపాడ్‌కు చేరుకుంటారు
 • 12.30: ప్రత్యేక హెలిక్టాపర్‌లో విజయవాడ ఎయిర్‌పోర్టుకు బయలుదేరతారు
 • 12.50: గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు