ఏపీలో అడుగుపెట్టిన మోడీ...

ఏపీలో అడుగుపెట్టిన మోడీ...

ప్రధాని మోడీ ఏపీలో అడుగుపెట్టారు. కొద్ది సేపటి క్రితం ప్రత్యేక విమానంలో ఆయన గన్నవరం చేరుకున్నారు. మోడీకి గవర్నర్‌ నరశింహన్‌ తదితరులు ఆహ్వానం పలికారు. విమానాశ్రయం నుంచి మోడీ నేరుగా ప్రత్యేక హెలికాప్టర్‌లో గుంటూరు చేరుకుంటారు. 

  • 11.10: హెలిపాడ్‌ నుంచి ఏటుకూరు బైపాస్‌ రోడ్డులోని బహిరంగ వేదిక సభాస్థలికి వెళ్తారు
  • 11.15: కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ వేదిక వద్దకు చేరుకుంటారు
  • 11.20 - 11.25: రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా రూ.7,000 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఓఎన్‌జీసీ, ప్రెటోలియం శాఖ అనుబంధ సంస్థ చేపట్టిన రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. మరో రూ.2,280 కోట్లతో బీపీసీఎల్‌ సంస్థ కృష్ణపట్నం పోర్టులో కోస్టల్‌ టర్మినల్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.
  • 11.30: ప్రారంభోత్సవ కార్యక్రమాల వేదిక నుంచి బయలుదేరి బీజేపీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు
  • 11.30 - 12.15: బహిరంగ సభలో పాల్గొంటారు
  • 12.20: బహిరంగ వేదిక సభాస్థలి నుంచి బయలుదేరుతారు
  • 12.25: గుంటూరులోని హెలిపాడ్‌కు చేరుకుంటారు
  • 12.30: ప్రత్యేక హెలిక్టాపర్‌లో విజయవాడ ఎయిర్‌పోర్టుకు బయలుదేరతారు
  • 12.50: గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు