కుమారస్వామికి మోడీ ఛాలెంజ్‌!

కుమారస్వామికి మోడీ ఛాలెంజ్‌!

'ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌' పీక్స్‌కు వెళ్లింది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ స్వీకరించారు. తన ఫిట్‌నెస్‌ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అంతటితో ఆగకుండా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి మోడీ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ విసిరారు. టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ మానికా బాత్రాతో పాటు 40 ఏళ్లకు పైగా వయసున్న ఐపీఎస్‌ అధికారులను ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌కు ఆహ్వానించారు. యోగా చేస్తూ.. ప్రకృతిలో ఉండే పంచతత్వాలతో ప్రేరణ పొందానని మోడీ చెప్పారు. ఇలా చేస్తే ఎంతో ఉత్తేజం పొందుతామని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. శ్వాసకు సంబంధించిన ఎక్సర్‌సైజ్‌లు కూడా చేస్తానని చెప్పారు.