అమరావతి మహానగరంగా ఎదుగుతోంది: మోడీ

అమరావతి మహానగరంగా ఎదుగుతోంది: మోడీ

అమరావతిని హెరిటేజ్‌ సిటీ అభివృద్ధి చేస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. ఇవాళ గుంటూరులోని ప్రజాచైతన్య సభలో ఆయన ప్రసంగించారు. తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టిన మోడీ.. ఎంతో మంది ప్రముఖులను అందించిన గడ్డ గుంటూరు అని అన్నారు. అక్షర క్రమంలో భారతదేశంలో ఏపీ ముందు వరుసలో ఉంటుందని.. అక్షర క్రమంలోనే కాదు, అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్ ముందు ఉంటుందన్నారు.  కేంద్ర ప్రభుత్వ పథకమైన హృదయ్ ద్వారా అమరావతి నగరం దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.  

'ఇప్పుడే ప్రారంభించిన పథకాలతో దేశం మొత్తానికి ప్రయోజనం చేకూరనుంది. చమురు, సహజ వాయువులను నిల్వచేసే అనేక స్టోరేజీలను దేశంలోని పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్నాం. పెట్రోలియం రంగంలో ఇబ్బందులు తలెత్తకుండా వీటిని చేపట్టాం' అని మోడీ వివరించారు.