ఆ విషయాల్లో బాబు నాకంటే సీనియర్‌: మోడీ

ఆ విషయాల్లో బాబు నాకంటే సీనియర్‌: మోడీ

తన కంటే సీనియర్‌ని అని చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేతల్లో చేసిందేమీ లేదని ప్రధాని మోడీ అన్నారు. ఇవాళ గుంటూరులో ఆయన బాబును డైరెక్ట్‌గా టార్గెట్‌ చేశారు. 'నాకంటే సీనియర్‌ని అని బాబు పదేపదే చెప్పుకుంటున్నారు. నిజమే.. మీరు నాకంటే సీనియరే.. పార్టీ ఫిరాయింపుల్లో మీరే సీనియర్‌. కొత్త కూటములు కట్టడంలో సీనియర్‌. మామను వెన్నుపోటు పొడవడంలో సీనియర్‌. ఓడిపోవడంలోనూ సీనియర్‌. ఏపీ ప్రజల కలల్ని నీరుగార్చడంలో సీనియర్‌. ఈ విషయాల్లో నేను మీతో పోటీ పడలేను' అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇవాళ ఎవర్ని తిడతారో.. రేపు వారి ఒళ్లోనే బాబు కూర్చుంటారన్న మోడీ.. ఎన్టీఆర్‌ అడుగుజాడల్లో నడుస్తామని ఆయన చెప్పారా లేదా అని ప్రశ్నించారు. 

ఏపీలో మౌలిక వసతులను మారుస్తానని చెప్పిన బాబు.. ఆయనే మారిపోయారని.. రాష్ట్రాభివృద్ధిని పక్కనబెట్టి తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కూలిపోయిన తన పార్టీ నిర్మాణంలో బిజీగా ఉన్నారని.. సన్‌రైజ్‌ ఏపీ బదులు కొడుకు అభివృద్ధిపై దృష్టిపెట్టారని మోడీ విమర్శించారు.