మోడీ ఏం చెబుతారు? బాబును టార్గెట్‌ చేస్తారా?

మోడీ ఏం చెబుతారు? బాబును టార్గెట్‌ చేస్తారా?

మరికొద్ది గంటల్లో ఏపీలో అడుగుపెట్టబోతున్న ప్రధాని మోడీ ఇక్కడ ఏం మాట్లాడతారు? ఏం చెబుతారు? లెక్కలు తీస్తారా? చంద్రబాబుపై ఎదురుదాడి చేస్తారా? అనేది ఉత్కంఠ రేపుతోంది. ఏపీకి ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వలేకపోయామో మోడీ చెబుతారని.. హోదా ఇవ్వలేకపోయినా ఏపీకి ఏం చేసిందీ వివరిస్తారని.. పోలవరం ప్రాజెక్టులో అవకతవలు జరిగాయని.. ఏపీకి వేల కోట్ల నిధులు ఇచ్చామని మోడీ పూసగుచ్చినట్టు వివరిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 

ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తరువాత బాబు, మోడీ బద్ధ శత్రువులుగా మారిపోయారు. ప్రతి వేదికపైనా మోడీని బాబు టార్గెట్‌ చేస్తున్నారు. కేంద్రాన్ని చీల్చి చెండాడుతుననారు. విటన్నింటికీ గుంటూరు వేదికగా మోడీ కౌంటర్‌ ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఎదురుదాడి చేయడంలో దిట్టగా పేరున్న మోడీ.. చంద్రబాబుపై అది రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్‌తో బాబు జతకట్టడంపైనా మోడీ వ్యాఖ్యానించే అవకాశాలూ ఉన్నాయి. 

ఇక.. ఇవాళ ప్రధాన వేదికపై మోడీతో పాటు కేంద్ర, రాష్ట్రాలకు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు మొత్తం 43 మంది ఆశీనులు కాబోతున్నారు. వీరంతా మోడీ కంటే ముందే ప్రసంగాలు పూర్తిచేస్తారు. ఉదయం 11.30 గంటలకు మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. సుమారు గంటపాటు మాట్లాడే అవకాశం ఉంది.