మహానటికి మరిన్ని స్క్రీన్స్ 

మహానటికి మరిన్ని స్క్రీన్స్ 

మహానటి..సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం గతవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సావిత్రమ్మ జీవితాన్ని వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కారించడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమాపై పాజిటివ్ మౌత్ టాక్  బాగుండడంతో ఓవర్సీస్ లోను, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మరిన్ని స్క్రీన్ లను పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు. 

ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చడంతో అన్ని ఏజ్ గ్రూపుల వారు థియేటర్లకు తరలి వస్తున్నారు. సినీ ప్రముఖులైన మెగా స్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ లతో పాటు మరికొద్ది మంది సినిమాను బాగా ప్రశంసిస్తున్నారు. సావిత్రి గారి జీవితాన్ని బాగా చూపించారని దర్శకుడు నాగ్ అశ్విన్ ను పొగడ్తలతో ముంచెత్తున్నారు. కీర్తి సురేష్ అచ్చం సావిత్రిలా కనిపించి మెప్పించడం కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. స్వప్న దత్, ప్రియాంక దత్ లు ఈ సినిమాను నిర్మించారు.