ఏడు మండలాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం...

ఏడు మండలాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం...

తిత్లీ తుఫాన్ బీభత్సం కొనసాగుతోంది... శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఏడు మండలాల్లో ఇప్పటికే 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలోని వివిధ మండ‌లాల్లో  ఇప్పటివ‌ర‌కు న‌మోదైన‌ వ‌ర్షపాతం వివరాలను ఓసారి పరిశీలిస్తే... ప‌లాస‌, వ‌జ్రపుకొత్తూరు, నందిగాం మండలాల్లో 28.02 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాదు... కోట‌బొమ్మాళి 24.82, సంత‌బొమ్మాళి 24.42, ఇచ్ఛాపురం 23.76, టెక్కలి 23.46, సోంపేట‌, మంద‌స 13.26, క‌విటి 12.44, పొలాకి 9.74, జ‌లుమూరు 9.06, ఎల్ఎన్‌పేట‌ 8.92, న‌ర‌స‌న్నపేట 6.04, పొందూరు 5.8, లావేరు 4.94, శ్రీకాకుళం 4.62, ర‌ణ‌స్థలం 4.58, ఎచ్చెర్ల 4.48, బూర్జ‌ 4.28, గార 4.02, స‌రుబుజ్జులి 3.48, ఆముదాలవ‌ల‌స 3.36, జి.సిగ‌డాంలో 2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు అయినట్టు అధికారులు తెలిపారు.