'చంద్రబాబుకు ఓటమి తప్పదు'

'చంద్రబాబుకు ఓటమి తప్పదు'

రాజకీయ వ్యవస్థకు పట్టిన చీడ పురుగు చంద్రబాబునాయుడు అని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. ఇవాళ ఆలేరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని అన్నారు. తనకు మోకాళ్ల నొప్పి ఉందని.. అయినా కూడా చంద్రబాబు ఓడిపోవాలని కోరుతూ తిరుపతి మెట్లు ఎక్కి మొక్కుకుంటానని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది వైసీపీ అధినేత జగన్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లేనని, చంద్రబాబు చేసిందేమీ లేదని మోత్కుపల్లి విమర్శించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి అని అన్నారు. చంద్రబాబు నడిపే పార్టీ దుర్మార్గపు పార్టీ అని, ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి ప్రదేశ్‌గా మర్చారని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని మోసం చేసిన చంద్రబాబు.. టీడీపీని నందమూరి కుటుంబానికి అప్పజెప్పాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెబుతారని మోత్కుపల్లి అన్నారు.