పెరగనున్న సినిమా టికెట్ ధరలు

పెరగనున్న సినిమా టికెట్ ధరలు

మామూలు థియేటర్స్ లో సినిమా టికెట్ రేట్ల కంటే.. మాల్స్ లో ఉండే సినిమా టికెట్ రేట్లు రెండు మూడు రేట్లు ఎక్కువగా ఉంటాయన్న సంగతి తెలిసిందే.  అందులోను బెంగళూరు థియేటర్స్ లో రేట్లు దేశంలోని మిగతా థియేటర్స్ తో పోలిస్తే ఎక్కువ.  ఇప్పుడు ఈ రేటు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తున్నది.  

థియేటర్స్ లో 100 స్క్వేర్ మీటర్స్ కు ప్రభుత్వం సంవత్సరానికి రూ.1000 /- లైసెన్స్ ఫీజుగా వసూలు చేస్తుంది.  ఈ ఫీజ్ ను మూడున్నర రేట్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  అంటే.. రూ.1000/- గా ఉన్న ఫీజు.. ఇక నుంచి రూ.4500/- కానున్నది.  దీంతో థియేటర్స్ యాజమాన్యంపై మూడింతల భారం పడబోతున్నది.  ఈ భారాన్ని భరించాలంటే టికెట్స్ రేట్లు పెంచడం ఒక్కటే మార్గమని అంటున్నారు గరుడ మాల్ ఎమ్మెల్యే ఉదయ్ గరుడాచలం.  1994 నుంచి అమలులో ఉన్న లైసెన్స్ ఫీజ్ ను ఒక్కసారిగా మూడింతలు పెంచడం భావ్యం కాదని అంటున్నారు.