అమిత్ షా పై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

అమిత్ షా పై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... అమిత్ షా ఫ్రస్టేషన్‌లో ఉన్నాడని విమర్శించారు. తెలంగాణలో ఆర్ఎస్ఎస్ రాజ్యం నడవదని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధ పాలనే ఉంటుందని అసదుద్దీన్ స్పష్టం చేశారు. లైంగిక ఆరోపణలు ఎజే అక్బర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిన్న కరీంనగర్‌లో జరిగిన బీజెపీ సమర భేరి సభలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌, ఎంఐఎం పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.