ఫిట్‌నెస్‌ కోసం ఎన్నో వదులుకున్నా...

ఫిట్‌నెస్‌ కోసం ఎన్నో వదులుకున్నా...

ఫిట్‌నెస్ కోసం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది... స్పెషల్ డైట్లు తప్పువు... కొన్ని సార్లు ఇష్టమైన ఆహార పదార్థాలకు సైతం దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. టీమిండియాను కెప్టెన్‌గా విజయాల బాటలో నడిపించి... కెప్టెన్సీ వదులుకున్నా... వికెట్ల వెనుక చురుకుగా కదులుతూ... అవసరమైనప్పుడు బ్యాట్‌కు పనిచెబుతూ తాను ఇప్పటికీ ఫిట్ అని నిరూపించుకుంటున్నాడు మహేంద్రసింగ్ ధోనీ... ఫిట్‌నెస్‌ కోసం ధోనీ తనకెంతో ఇష్టమైన ఎన్నో ఆహార పదార్థాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపాడు. ఈ మిస్టర్ కూల్‌కు చాక్లెట్లు, మిల్క్‌షేక్స్‌, సాఫ్ట్‌ డ్రింక్స్‌ ఎంతో ఇష్టమట... కానీ, ఫిట్‌గా ఉండేందుకు వాటన్నింటినీ దూరం పెట్టినట్లు చెప్పారు ధోనీ. ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహేంద్రుడు ఫిట్‌నెస్ గురించి మాట్లాడుతూ... తప్పనిసరిగా మారాలి. మెరుగైన ఫలితాలు సాధించాలంటే మార్పులు అవసరం అన్నాడు. ఈ సందర్భంగా తను అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ కాకముందు... ఆ తర్వాత మారిన ఆహారపు అలవాట్లను చెప్పుకొచ్చాడు ధోనీ.

 2004లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అరంగేట్రం చేసినప్పుడు నా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకున్నానన్న మిస్టర్ కూల్... బట్టర్‌ చికెన్‌, నాన్‌, మిల్క్‌ షేక్స్‌, చాక్లెట్లు, సాఫ్ట్‌ డ్రింక్స్‌ తీసుకునేవాడిని... కానీ, 28 ఏళ్లు వచ్చేసరికి చాక్లెట్లు, మిల్క్‌షేక్స్‌ తీసుకోవడం మానేశానన్నారు. ఆ తర్వాత సాఫ్ట్‌ డ్రింక్స్‌కూ దూరమయ్యానని... ఇక టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినప్పటి నుంచి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు ధోనీ వెల్లడించారు. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపు తెచ్చుకున్న ధోనీ... కెప్టెన్‌గా దాదా టీమిండియాకు దూకుడు నేర్పితే... అదే దూకుడును కొనసాగిస్తూ... విదేశీ, స్వదేశీ అనే తేడా లేకుండా టీమిండియాకు విజయాలను అందించారాయన. ఈ 36 ఏళ్ల మిస్టర్ కూల్... కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే... వికెట్ల వెనుక చురుకుగా కదులుతూ... అవసరమైనప్పుడు తన బ్యాట్‌కు పనిచెబుతూ... రికార్డులు సృష్టించాడు. కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్నా... ఎప్పటికప్పుడు టీమిండియాలోకి యువ క్రికెటర్లు వస్తున్నా... వాళ్లతో పోటీపడుతూ పరుగులు చేస్తున్నాడంటే అది ఫిట్‌నెస్ తోనే సాధ్యమైందన్నమాట.