సిడ్నీ చేరుకున్న వన్డే ఆటగాళ్లు

సిడ్నీ చేరుకున్న వన్డే ఆటగాళ్లు

నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుని అస్ట్రేలియా గడ్డపై భారత్‌ తొలిసారిగా టెస్ట్ సిరీస్ గెలిచింది. ఇక వన్డే మూడు వన్డేల సిరీస్‌ ఈ నెల 12 నుండి మొదలవ్వనుంది. ఈ వన్డే  సిరీస్‌కి ఎంపికైన మహేంద్రసింగ్ ధోనీ, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, చాహల్, అంబటి రాయుడు, హార్దిక్ పాండ్య, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్ లు ఈరోజు సిడ్నీకి చేరుకున్నారు. కూతురు పుట్టడంతో స్వదేశానికి వచ్చిన రోహిత్ శర్మ కూడా వీరితో పాటు వెళ్లాడు. ప్రత్యేక బస్సులో వీరందరూ హోటల్ కి చేరుకున్నారు. టీం మేనేజ్‌మెంట్ ఇంతకుముందు ప్రకటించిన వన్డే జట్టులో ఒక మార్పు చేసింది. జస్‌ప్రీత్ బుమ్రాకి విశ్రాంతినిచ్చి అతని స్థానంలో మహ్మద్ సిరాజ్‌ని ఎంపిక చేశారు.

జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.