వరల్డ్‌కప్‌లో పంత్‌.. ఎమ్మెస్కే ఏమంటున్నాడు..?

వరల్డ్‌కప్‌లో పంత్‌.. ఎమ్మెస్కే ఏమంటున్నాడు..?

ధనాధన్‌ ధోనీ ఉండగా రిషభ్‌ పంత్‌కు వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కుతుందా? హార్దిక్‌ పాండ్యాతోపాటు విజయ్‌ శంకర్‌కు కూడా ఆల్‌రౌండర్‌ కోటాలో ఛాన్సిస్తారా? మూడో ఓపెనర్‌గా అజింక్యా రహానేను సెలెక్ట్‌ చేస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబిచ్చారు బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌. వీరు ముగ్గరూ వరల్డ్‌ కప్‌ రేసులో ఉన్నారని స్పష్టం చేశారు. తానేంటో రిషభ్‌ పంత్‌ నిరూపించుకున్నాడని..  విజయ్‌ శంకర్‌పై ఫుల్‌ క్లారిటీ ఉందని చెప్పారు. ఇటీవల లిస్ట్‌-ఎ క్రికెట్‌లో రాణించిన రహానేను మూడో ఓపెనర్‌గా పరిశీలించాలని అనుకుంటున్నామని తెలిపారు. పంత్‌ ఆటతీరు సంతోషాన్ని కలిగించిందన్న ఎమ్మెస్కే.. తన ప్రదర్శనతో విజయ్‌ సెలక్షన్‌కు కొత్త కోణం తీసుకొచ్చాడని అభిప్రాయపడ్డారు. కేఎల్‌ రాహుల్‌ కూడా రేసులోనే ఉన్నాడని.. ఐతే అతడు ఫామ్‌ను అందుకోవాల్సివుందని ప్రసాద్‌ స్పష్టం చేశారు.