బాబు అవినీతి మహాభారతాన్ని మించింది...

బాబు అవినీతి మహాభారతాన్ని మించింది...

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవినీతి మహాభారతాన్ని మించిందని ఆరోపించారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం... ప్రధాని నరేంద్ర మోదీకి లేఖరాసిన ఆయన ఏపీకి ప్రత్యేక హోదా / ప్యాకేజీపై సీఎం  చంద్రబాబు, మీకు మధ్య ఎలాంటి ఒప్పందం చేసుకున్నారో గానీ... ఆ హోదా సాధన పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దారుణంగా ఖర్చు చూస్తూ... రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి నష్టం కలిగిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు ముద్రగడ.  ఆంధ్ర అబద్దాల ముఖ్యమంత్రి చంద్రబాబు అని లేఖలో ఆరోపించిన ఆయన... ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబును మీరు కాపాడడంతో ఈ రోజు రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిందన్నారు ముద్రగడ... చంద్రబాబును ఆరోజే జైలుకు పంపిఉంటే... రాష్ట్రానికి రెండు రకాల అన్యాయం జరిగేది కాదన్న కాపు ఉద్యమ నేత... బాబు జైలుకు వెళ్లి ఉంటే హోదా వచ్చేది, ప్రజాధనం దుర్వినియోగం అయ్యేది కాదని పేర్కొన్నారు.