మున్నాభాయ్ 3 .. ఈ ఏడాదిలోనే..!!

మున్నాభాయ్ 3 .. ఈ ఏడాదిలోనే..!!

మున్నాభాయ్ సీరీస్ లో రెండు సినిమాలు వచ్చాయి.  మున్నాభాయ్ ఎంబీబిఎస్, లగేరహో మున్నాభాయ్ సినిమాలు రిలీజ్ అయ్యి చాలాకాలం అయింది.  ఈ రెండు సినిమాలు సూపర్ హిట్టయ్యాయి.  ఆ రెండు సినిమాల తరువాత మూడో పార్ట్ మున్నాభాయ్ అప్పట్లో వెంటనే ఉంటుందని చెప్పినా.. కొన్ని కారణాల వలన సినిమా తెరకెక్కలేదు.  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది.  

లగేరహో మున్నాభాయ్ కు కొనసాగింపుగా మున్నాభాయ్ 3 సినిమాను తెరకెక్కించబోతున్నట్టు అర్షాద్ వర్షి చెప్పాడు.  దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మూడో పార్ట్ కు సంబంధించిన కథను రెడీ చేస్తున్నారని, ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకు వెళ్తుందని అన్నారు.  మున్నాభాయ్ ఎంబిబిఎస్ లో సంజయ్ దత్ కు జోడిగా విద్యాబాలన్ నటిస్తే.. లగేరహో మున్నాభాయ్ లో గ్రేసీ సింగ్ హీరోయిన్ గా నటించింది.