కన్నా నియామకం సరైనదే

కన్నా నియామకం సరైనదే

భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ నియామకం సరైందే అన్నారు ఆ పార్టీ నేత మురళీధర్ రావు... కన్నా లక్ష్మీనారాయణ ఎంతో అనుభవం ఉన్న నాయకుడు... ఈ నిర్ణయం సహేతుకమైనదేనని... పార్టీలో అన్ని స్థాయిల్లోని నాయకులు కేంద్ర నాయకత్వం నిర్ణయాన్ని సమర్ధిస్తారని స్పష్టం చేశారాయన. బీజేపీలో బాధ్యతలు ఎవరికీ కులం, జాతి ఆధారంగా ఇవ్వడం జరగదన్న మురళీధరరావు... ఏపీలో జాతీయ పార్టీల రాజకీయాల ప్రాధాన్యం, ప్రభావం పునరావృతం కానుందన్నారు. 

ఇక కర్నాటకలో యడ్యూరప్ప నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని దీమా వ్యక్తం చేశారు మురళీధరరావు... ఎవరి మద్దతు అవసరం లేకుండానే, సొంతంగానే బీజేపీ సర్కార్ ఏర్పడుతుందని వెల్లడించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతో నిర్వహిస్తున్న సమావేశంలో రాష్ట్రాల వారీగా పార్టీ పరిస్థితిపై చర్చిస్తామని... రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం కంటే మరింత బలంతో మోడీ నేతృత్వంలో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే బీజేపీ టార్గెట్ అన్నారాయన. అంతేగాకుండా, మోడీ నేతృత్వంలోని నాలుగేళ్ల కేంద్ర ప్రభుత్వ పాలన, ప్రభావంపై సుదీర్ఘంగా చర్చిస్తామన్నారు మురళీధరరావు.