నా పై హత్యా ప్రయత్నం చేశారు: బాల్క సుమన్

నా పై హత్యా ప్రయత్నం చేశారు: బాల్క సుమన్

తెలంగాణ రాష్ట్ర సమితిలో టికెట్ దక్కని వారు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే టిక్కెట్లు ఖరారైన వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం టిక్కెట్ దక్కిన ఎంపీ బాల్క సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రచారంలో నల్లాల ఓదేలు వర్గం హత్యాయత్నానికి పాల్పడిందని బాల్క సుమన్ అన్నారు. అయితే దీన్ని తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తీవ్రంగా ఖండించారు. 

ఈరోజు నియోజకవర్గంలోని ఇందారం గ్రామంలో పర్యటించేందుకు వచ్చిన బాల్క సుమన్‌ను ఓదేలు వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఓదేలు అనుచరుడు రేగుంట గట్టయ్య కిరోసిన్‌ పోసుకుని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మంటలు ఆర్పేందుకు యత్నించేందుకు ప్రయత్నించిన 15 మందికి గాయాలపాలయ్యారు.  వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గట్టయ్యను వరంగల్‌ ఆస్పత్రికి తరలించాలని సూచించగా... 12 మందిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలించారు. 

తనకు చెన్నూరు టిక్కెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నిన్న ఆయన స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు. దీంతో ఓదేలు వర్గం బాల్క సుమన్‌పై ఆగ్రహంతో ఉన్నారు.