పవన్ తో కలిసి తిరుపతికి బయలుదేరిన నాదేండ్ల

పవన్ తో కలిసి తిరుపతికి బయలుదేరిన  నాదేండ్ల

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ విజయవాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ను కలిశారు. గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో ఆయనతో కలిసి తిరుపతికి బయలుదేరారు. అక్కడ పవన్ కల్యాణ్‌ తో చర్చలు జరుపనున్నారని సమాచారం. జనసేనలో చేరిన తరువాత పవన్ కల్యాణ్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

గతకొంత కాలంగా కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న మనోహర్.. రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్ రావు తనయుడిగా రాజకీయ రంగప్రవేశం చేసిన మనోహర్.. గుంటూరు జిల్లా తెనాలి నుంచి  రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2011 నుంచి 2014 వరకు శాసనసభలో స్పీకర్ గా పనిచేశారు.  వచ్చే ఎన్నికల్లో జనసేన తరుపున తెనాలి అసెంబ్లీకి పోటీచేసేందుకు అయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.