జనసేనలోకి మాజీ స్పీకర్...

జనసేనలోకి మాజీ స్పీకర్...

కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన తిరుమలకి బయల్దేరి వెళ్లారు. ఈ రోజు సాయంత్రానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కూడా తిరుమల చేరుకోనున్నారు. ఈ రోజు తిరుమల చేరుకోనున్న పవన్... రేపు శ్రీవారిని దర్శించుకోనున్నారు. నాదెండ్ల భాస్కర్‌రావు కుమారుడిగా కాంగ్రెస్‌ పార్టీలో అడుగుపెట్టిన నాదెండ్ల మనోహర్... రాజకీయాలపై తనదైన ముద్రవేశారు. అయితే ఆయన టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరిగినా... ఖండిస్తూ వచ్చిన ఆయన... తనకు ఏపీ రాజకీయాల్లో కాకపోయినా... జాతీయ రాజకీయాల్లో గుర్తింపు లభిస్తుందని భావించినా... సరైన గుర్తింపు దక్కలేదు. దీంతో ఆయన జనసేన పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చారు. మరోవైపు క్లీన్ ఇమేజ్ ఉన్న నాదేండ్ల మనోహర్ లాంటి నేతను పార్టీలో చేర్చుకుంటే మంచిదనే అభిప్రాయంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నట్టు తెలుస్తోంది.