చైతన్య.. సమంతలలో విజయం ఎవరిదో..?

చైతన్య.. సమంతలలో విజయం ఎవరిదో..?

నాగ చైతన్య హీరోగా వస్తున్న శైలజా రెడ్డి అల్లుడు, సమంత మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న యూటర్న్ సినిమాలు ఈ నెల 13 వ తేదీన రిలీజ్ అవుతున్నాయి.  ఈ రెండు వేర్వేరు జానర్లో వస్తున్నాయి.  శైలజా రెడ్డి అల్లుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తుంటే.. యూటర్న్ థ్రిల్లింగ్ హర్రర్ జానర్ లో వస్తున్నది.  ఈ రెండు ఒకేరోజు రిలీజ్ అవుతుండటంతో ఆసక్తికరమైన పోటీ ఏర్పడింది.  

ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు రెండు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.  నాగచైతన్య మొదటిసారిగా చాలా స్మార్ట్ గా, పాజిటివ్ థింకింగ్ తో కనిపిస్తున్నాడు.  రమ్య కృష్ణ వంటి పవర్ ఫుల్ పాత్ర ఇందులో ఉండటంతో.. సినిమాకు ప్లస్ అవుతుందని అంటున్నారు.  భలేభలే మగాడివోయ్, మహానుభావుడు వంటి హిట్స్ ఇచ్చిన తరువాత మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి.  మరోవైపు సమంత యూటర్న్ హర్రర్ జానర్ లో వస్తున్నది.  కన్నడ సినిమా యూటర్న్ కు ఇది రీమేక్.  రోడ్డుపై జరిగిన యాక్సిడెంట్ చుట్టూనే సినిమా ఉంటుందని తెలుస్తున్నది.  సమంత క్యారెక్టరైజేషన్ బాగున్నట్టు ప్రచారం.  మరి రెండు సినిమాల్లో ప్రేక్షకులు ఎవరికి సపోర్ట్ చేస్తారో తెలియాలంటే వినాయక చవితి వరకు ఆగాల్సిందే.