నాగార్జున కెరీర్లో మర్చిపోలేని రోజు..

నాగార్జున కెరీర్లో మర్చిపోలేని రోజు..

అక్కినేని కుటుంబానికి మే 23 కు అవినాభావ సంబంధం ఉంది.  అక్కినేని కుటుంబం నటించిన మనం సినిమా విడుదలయ్యి నేటికీ నాలుగు సంవత్సరాలు.  అక్కినేని నాగేశ్వర రావు నటించిన చివరి సినిమా కూడా ఇదే కావడం విశేషం.  విక్రమ్ కుమార్ నటించిన మనం సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.  ఈ సినిమా ఓ క్లాసికల్ గా నిలిచింది.  అక్కినేని కోడలు కాకముందు సమంత కూడా ఈ సినిమాలో నటించి నాగేశ్వర రావు మెప్పును పొందింది.

ఇక మరో విశేషం ఏమిటంటే.. నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా విక్రమ్ రిలీజ్ కూడా ఈరోజే.  సరిగ్గా 32 సంవత్సరాల క్రితం అంటే 1986, మే 23 న విక్రమ్ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  ఈరోజు జీవితంలో మర్చిపోలేని రోజని నాగార్జున ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.