ఎమ్మెల్యే చిరుమర్తికి చేదు అనుభవం

ఎమ్మెల్యే చిరుమర్తికి చేదు అనుభవం

నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు చేదు అనుభవం ఎదురైంది.చెరువు గట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా దర్శనానికి గుట్టపైకి వెళ్లారు.అయితే పర్మిషన్ లేదoటూ కారును నిలిపి వేయడం తో  ఎమ్మెల్యే చిరుమర్తి కాలినడకన గుట్ట మీదకి నడిచి వెళ్లారు. ఆలయ అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా అగౌరవపరిచారని ఆలయ మెట్లపై కూర్చొని నిరసన తెలిపారు. అ తర్వాత ఉత్సవాల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వాహనాలను గుట్టపైకి నేరుగా అనుమతించడంతో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేసారు.  స్వామివారి గుట్టపైన అధికార పార్టీ ఆగడాలు పెరిగి పోయాయని మండిపడ్డారు.