అసౌకర్యాలతో అస్పత్రులు వెక్కిరిస్తున్నాయి: కిషన్ రెడ్డి

అసౌకర్యాలతో అస్పత్రులు వెక్కిరిస్తున్నాయి: కిషన్ రెడ్డి

నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సౌకర్యాలను, మెడికల్ కాలేజి ఏర్పాట్లను బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి పరిశీలించారు. ఆస్పత్రిలో సౌకర్యాలపై ఆయన ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ మాటలకు.. ఆస్పత్రిలో సౌకర్యాలకు పొంతన లేదని, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి మేడి పండును తలపిస్తుందని విమర్శించారు. మెడికల్ కాలేజీ కి కావాల్సిన సౌకర్యాల రూప కల్పనలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కిషన్ రెడ్డి అన్నారు. మెడికల్ కాలేజీ ప్రభుత్వం చెబుతున్నవిధంగా ప్రారంభం కావడం కష్టమేనన్నారు. ఇలా అయితే మెడికల్ కాలేజీ ప్రభుత్వం చెబుతున్న విధంగా ప్రారంభం అయ్యేది కష్టమే. 

 

మంత్రి సమయం కోసం ఐదు నెలలుగా ఎదురుచూస్తున్నారు... డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించడం లేదు... వెల్ నెస్ సెంటర్ ప్రారంభానికి మంత్రి సమయం దొరకదా... ఇది పాపం కాదా... పసిపిల్లలను క్యూలో నిలబెట్టారు. నీళ్లు లేవు... వార్డుల్లో సౌకర్యాలు లేవు... అడుగడుగునా అనేక అసౌకర్యాలతో ఆస్పత్రులు వెక్కిరిస్తున్నాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం తప్పదని బీజేపీ నేత కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.