శ్రీరెడ్డిపై నాని కేసు

శ్రీరెడ్డిపై నాని కేసు

క్యాస్టింగ్ కౌచ్ వివాదం చాలా వరకు సద్దుమణిగింది.  క్యాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా పోరాటం చేసిన శ్రీరెడ్డికి మద్దతుగా చాలామంది నిలిచిన సంగతి తెలిసిందే.  ఆ తరువాత శ్రీరెడ్డి అసలు విషయాన్ని పక్కన పెట్టి, పర్సనల్ వ్యవహారంలో తలదూర్చింది.  టాలీవుడ్ ప్రముఖుల ఫోటోలను వరసగా విడుదల చేయడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. మెగా ఫ్యామిలీ గురించి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడైతే శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేయడంతో.. శ్రీరెడ్డికి సపోర్ట్ చేసిన వారు పక్కకు తప్పుకున్నారు.  తరువాత తరువాత శ్రీరెడ్డి మరింత రెచ్చిపోయి నాచురల్ స్టార్ నానిపై కూడా వ్యాఖ్యలు చేసింది.  మొదట్లో పెద్దగా పట్టించుకోని నాని, ఇప్పుడు ఆమెపై కేసు పెట్టాడు.  తాను ఎలాంటి వ్యక్తినో అందరికి తెలుసునని.. తనపై అనవసరంగా అభియోగాలు చేసిన శ్రీరెడ్డిపై నాని కేసు నమోదు చేశాడు.