సేతుపతి పాత్రలో నాని !

సేతుపతి పాత్రలో నాని !

తమిళ హీరో విజయ్ సేతుపతి తాజా చిత్రం '96'.  గత వారమే విడుదలైన ఈ సినిమా తమిళనాడులో మంచి ఫలితాన్ని అందుకుని దిగ్విజయంగా నడుస్తోంది.  వసూళ్లు సైతం బాగానే ఉన్నాయి.  దీంతో ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయాలని అనుకుంటున్నారట నిర్మాత దిల్ రాజు. 

ఈ రీమేక్లో విజయ్ సేతుపతి పాత్రలో నాని చేస్తారని, కథానాయకిగా త్రిషనే నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.  మరి ఈ రీమేక్ ను ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ చేస్తారా లేకపోతే వేరే తెలుగు దర్శకుడు ఎవరైనా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.