నాని సినిమా చిరు సినిమాకి కాపీనా ?

నాని సినిమా చిరు సినిమాకి కాపీనా ?

ఒకప్పుడు వరుస హిట్లతో వేగంగా ఎదిగిన హీరో నానికి సరైన హిట్ దొరికి చాలా రోజులైంది.  ఆయన ఘాట్ చిత్రం 'దేవదాస్'కూడ ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది.  దీంతో ఈసారి హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో నాని విక్రమ్ కుమార్ తో చేతులు కలిపాడు.  

వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా డిటెక్టివ్ కామెడీ థ్రిల్లర్ జానర్లో ఉంటుందట.  ఒక్కమాటలో చెప్పాలంటే చిరంజీవి, జంధ్యాల కాంబినేషన్లో వచ్చిన 'చంటబ్బాయ్' సినిమా తరహాలో ఉంటుందని అంటున్నారు.  ఎన్నాళ్ళో నుండో 'చంటబ్బాయ్' లాంటి సినిమా చేయాలని అనుకుంటున్న నానికి  విక్రమ్ కుమార్ వలన ఆ కోరిక నెరవేరుతుందన్నమాట.