వాళ్లిద్దరినీ మిస్సవుతున్నా: నారా బ్రాహ్మిణి

వాళ్లిద్దరినీ మిస్సవుతున్నా: నారా బ్రాహ్మిణి

'ఎన్టీఆర్‌ కథానాయకుడు'లో ప్రతి పాత్రలో అందరూ జీవించారని ఎన్టీఆర్‌ మనవరాలు నారా బ్రాహ్మిణి అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఏఎంబీ థియేటర్‌లో బాలకృష్ణ, క్రిష్, అనుష్కలతో కలిసి ఆమె ఈ సినిమాను చూశారు. అనంతరం బ్రాహ్మిణి మాట్లాడుతూ తెరపై నాన్నని కాకుండా... తాతగారినే చూసినట్టుందన్నారు. 'మా తాత గారితో కొన్ని రోజులు మాత్రమే గడిపాను. తారకం నాన్నమ్మని అసలు చూడలేదు. నేను పుట్టక ముందే ఆమె చనిపోయారు' అని బ్రాహ్మిణి చెప్పారు. కానీ.. సినిమాలో తాత-నాన్నమ్మ పాత్రలను చూస్తూంటే వారిద్దరినీ చాలా మిస్ అయ్యానని అనిపిస్తోందని అన్నారు.