బీ.జే.పీ. అంటే... భారతీయ జగన్ పవన్ పార్టీ...

బీ.జే.పీ. అంటే... భారతీయ జగన్ పవన్ పార్టీ...

భారతీయ జనతా పార్టీకి కొత్త అర్థం చెప్పారు ఏపీ మంత్రి నారా లోకేష్... అమరావతిలో నిర్వహించిన 'నారా హమారా... టీడీపీ హమారా' సభలో ఆయన మాట్లాడుతూ... బీ.జే.పీ. అంటే బీజేపీ పార్టీ, జగన్ పార్టీ, పవన్ పార్టీ అంటూ సెటైర్లు వేశారు. ఇక పవన్ కల్యాణ్... ప్రధాని నరేంద్ర మోడీ దత్త పుత్రుడని ఆరోపించిన లోకేష్... అభివృద్ధి బాగుంది అన్న పవన్ ఇప్పుడు అవినీతి అంటున్నారని మండిపడ్డారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి... పార్టీలు రాజకీయాలు కుట్ర చేస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలని సూచించిన ఏపీ ఐటీ మంత్రి... ఆయన జగన్ మోహన్ రెడ్డి కాదు... జగన్ మోడీ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే నా మీద చేసిన ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ విసిరారు లోకేష్. ఇక జగన్, పవన్ కి ఓటు వేస్తే... బీజేపీకి వేసినట్లే నని ఆరోపించారు. 

ముస్లింలు అందరిని మైనారిటీలు అంటారు... కానీ, నా మనసులో ముస్లింలకు మెజారిటీ స్థానం ఉంటుందన్నారు నారా లోకేష్... నాలుగు సంవత్సరాల కాలంలో ముస్లింల సంక్షేమం కోసం రూ. 2,700 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఇక బీజేపీ నేతలు బాహుబలి కన్నా పెద్ద సినిమా చూపించారని ఎద్దేవా చేసిన ఆయన... ప్యాకేజీ అని మాట తప్పారని మండిపడ్డారు. సంక్షేమం, అభివృద్ధి సీఎం చంద్రబాబు అజెండా అని స్పష్టం చేసిన లోకేష్... రైతుల రుణాలు మాఫీ ఘనత చంద్రబాబుదే అన్నారు.