లిస్ట్ లో ప్రత్యేక హోదా లేదేంటీ...? 

లిస్ట్ లో ప్రత్యేక హోదా లేదేంటీ...? 

ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ప్రధానికి ఇచ్చిన లిస్ట్ లో ప్రత్యేక హోదా అంశం ఎందుకు లేదని ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రధానికి ట్వీట్ చేశారు. ఓవైపు ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చమని చెబుతున్నారు. మరోవైపు... కుతుబ్ మినార్ అంతా  లిస్ట్ కేంద్రానికి ఇచ్చారు ఇదేం పద్దతి? అని ప్రశ్నించారు. ఇందులో మీరు చెప్పేవన్నీ అబద్ధాలు అని తేలిపోయిందన్నారు. ఈ విషయాలన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు లోకేష్.  తమపై తప్పుడు ప్రచారాన్ని మానుకుని... ఏపీకి ఇచ్చిన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని లోకేష్ ట్వీట్ చేశారు.