ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చిన సందీప్ కిషన్ సినిమా !

ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చిన సందీప్ కిషన్ సినిమా !

కొన్నాళ్ల క్రితం హీరో సందీప్ కిషన్ తమిళ యువ దర్శకుడు కార్తిక్ నరేన్ దర్శకత్వంలో 'నరగసూరన్' అనే సినిమాను మొదలుపెట్టిన తెలిసిందే.  ఈ మధ్య టాప్ డైరెక్టర్, ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన గౌతమ్ మీనన్ తో ఆర్ధిక వివాదం వంటి కొన్ని ఇబ్బందుల్ని ఎదురుకున్న ఈ సినిమా ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. 

తాజాగా సెన్సార్ కార్యక్రమానికి వెళ్లిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ లేకుండా యు/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది.  త్వరలోనే ట్రైలర్ ను విడుదలచేసి విడుదల తేదీని ప్రకటించనున్నారు నిర్మాతలు.  అవింద స్వామి, శ్రియ శరన్ లాంటి స్టార్ నటులు నటిస్తున్న ఈ చిత్రాన్ని  తెలుగులో 'నరకాసురుడు' పేరుతో విడుదలచేయనున్నారు.