మ్యాచ్‌లో కామెంటేటర్ ఫీల్డింగ్...

మ్యాచ్‌లో కామెంటేటర్ ఫీల్డింగ్...

మ్యాచ్‌ మధ్యలో కామెంటేటర్‌ ఫీల్డింగ్‌ చేసాడు. ఈ అరుదైన ఘటన గురువారం లార్డ్స్ వేదికగా వరల్డ్ లెవెన్‌, వెస్ట్ విండీస్ జట్ల మధ్య జరిగిన టీ-20 ఛారిటీ మ్యాచ్‌లో చోటుచేసుకుంది. టీ-20 ఛారిటీ మ్యాచ్‌కి ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు నాసర్‌ హుస్సేన్‌ కామెంటేటర్‌గా వ్యవహరించాడు. హుస్సేన్‌ కామెంటరీ రూమ్‌ నుంచి కాకుండా..  ఏకంగా మైదానంలోకి వచ్చి కామెంటరీ చేసాడు. వెస్ట్ ఇండీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్నట్లుగా నిల్చుని కామెంటరీ చేశాడు. అనంతరం మరోసారి మ్యాచ్ మధ్యలోనే పాక్ ఆటగాడు అఫ్రిదిని ఇంటర్వ్యూ చేసాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై నెటిజన్లు తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు. 

Photo: FileShot