పార్లమెంట్ ఇంచార్జిలతో రాం లాల్ భేటీ

పార్లమెంట్ ఇంచార్జిలతో రాం లాల్ భేటీ

సంఘ వివిధ క్షేత్ర ప్రముఖులతో బీజేపీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి రాం లాల్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై చర్చ జరిపారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలవడం కోసం ఏమి చేయాలనే దానిపై రాం లాల్ వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు. అన్ని స్థాయిల్లో బీజేపీ వివిధ క్షేత్రాలు సమన్వయంతో పని చేయాలని, మోడీ మరోసారి ప్రధాని కావడం కోసం అన్ని క్షేత్రాలు కలిసి ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారు. 

మరోవైపు పార్లమెంట్ ఇంచార్జిలతోను రాం లాల్ సమావేశం అయ్యారు. మార్చి రెండు వరకు జాతీయ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేయాలని వారికి ఆదేశించారు. మార్చి రెండున బైక్ ర్యాలీలను విజయవంతం చేయాలి. ఈ నెల అంతా పార్టీ సంస్థాగత బలోపేతం, మోడీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు. ఈ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించినవి కావు.. దేశ ప్రధాని ఎన్నికకి సంబంధించినవి, దేశ భవిష్యత్తుకు సంబంధించినవి. ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీకి దేశ వ్యాప్తంగా అనుకూల వాతావరణం ఉంది. మార్చి రెండు తర్వాతే అభ్యర్థులపై చర్చ ఉంటుంది, అనంతరం నిర్ణయం తీసుకుంటాం అని స్పష్టం చేశారు. ఈ నెలాఖరు లోపు ఎదో ఒక రోజు రాష్ట్రానికి అమిత్ షా రానున్నారు అని ఆయన తెలిపారు.