అరవింద సమేత నటుడితో "పైరసీ" సినిమా..!!

అరవింద సమేత నటుడితో "పైరసీ" సినిమా..!!

ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా ఎలాంటి హిట్ సాధించిందో చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ కలెక్షన్ మూవీగా నిలిచింది.  ఇందులో నటించిన చాలామంది నటులకు మంచి పేరు వచ్చింది.  ముఖ్యంగా అందాల రాక్షసి హీరో నవీన్ చంద్రకు.  నవీన్ చంద్ర ఇందులో జగపతిబాబు కొడుకుగా నటించాడు. విలన్ గా మెప్పించాడు.  

ఇదిలా ఉంటె, సినిమా ఎంత పెద్ద హిట్ అయినా.. పైరసీ కారణంగా కలెక్షన్లు తగ్గిపోతున్నాయి.  పైరసీని అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా... ఫలితాలు మాత్రం కనిపించడం లేదు.  పైరసీని మెయిన్ కథగా తీసుకొని నవీన్ చంద్రతో ఏ పైరేటెడ్ లవ్ స్టోరీ అనే సినిమాను తీస్తున్నాడు అడ్డా దర్శకుడు జిఎస్ కార్తీక్.  పూజా ఝవేరి హీరోయిన్ గా చేస్తున్నది.  త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తోంది.