నవోదయ ఇంటర్‌కు అడ్మిషన్స్‌

నవోదయ ఇంటర్‌కు అడ్మిషన్స్‌

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నవోదయ విద్యాలయ సమితి ప్రకటన విడుదల చేసింది. 2018-19 విద్యాసంవత్సరంలో సీబీఎస్‌ఈ 11వ తరగతిలో ఎంపీసీ, బైపీసీ, కామర్స్, హ్యూమనిటీస్, వొకేషనల్ కోర్సులలో పరిమిత ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2017-18 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణులైనవారు ప్రవేశానికి అర్హులు. ఇంగ్లిష్ మీడియంలో చదివిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. 

జూలై 1, 2018 నాటికి 14 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారాలు స్థానిక జవహర్ నవోదయ విద్యాలయం నుంచి లేదా www.nvshg.org వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులు జూలై 5లోగా ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ వారికి అందజేయాలని తెలిపారు. రిజిస్టర్ స్పీడ్ పోస్టు ద్వారా సైతం సమర్పించవచ్చు. అడ్మిషన్ ప్రక్రియ మెరిట్, విద్యాలయ సమితి నియమావళి ప్రకారం రాష్ట్ర స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు.