ఏపీకి అందరం కలిసి సహకరిస్తాం..

ఏపీకి అందరం కలిసి సహకరిస్తాం..

కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఆంధ్రప్రదేశ్‌కి అందరం కలిసి సహకరిస్తామని తెలిపారు ఎన్సీపీ నేత శరద్ పవార్. ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు సంఘీభావం తెలిపిన ఆయన.. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు చేస్తోన్న పోరాటానికి మద్దతిస్తున్నామని ప్రకటించారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకోవడం అన్యాయమైన విషయమన్న పవార్.. రాజధానికి, పోలవరం ప్రాజెక్టులకు నిధులివ్వకపోవడం సరైందికాదన్నారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు భారతీయ జనతా పార్టీకి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు ఎన్సీపీ నేత.