ఏపీకి రూ.539 కోట్లు..

 ఏపీకి రూ.539 కోట్లు..

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) కింద మూడు రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం... ఈ మధ్యే ఎప్పుడూ ఊహించని రీతిలో కేరళపై తుపాన్ విరుచుకుపడింది. కోలుకోలేని రీతిలో దెబ్బతిన్న కేరళ... తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో తిత్లీ తుఫాన్ విధ్వంసం సృష్టించింది. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అధ్యక్షతన సమావేశమైన హై లెవల్ కమిటీ... నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్డీఆర్ఎఫ్‌) కింద కేరళకు రూ. 3,048.39 కోట్లు, నాగాలాండ్‌కు రూ. 131.16 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ. 539.52 కోట్లు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. గతంలో విడుదల చేసిన మొత్తానికి ఇది అదనపు సహాయం. అయితే కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో తమను ఆదుకోలేదంటూ ఇప్పటికే కేరళ, ఏపీ ప్రభుత్వాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. జరిగిన నష్టానికి.. కేంద్రం ఇచ్చేదానికి అసలు పొంతనేలేదని రాష్ట్ర ప్రభుత్వాలు మండిపడుతున్నాయి.