ఆఫీస్‌ లోన్‌పై పన్ను కట్టాల్సిందే...

ఆఫీస్‌ లోన్‌పై పన్ను కట్టాల్సిందే...

సాధారణంగా చాలా మంది ఉద్యోగులు తమ కంపెనీల నుంచి స్వల్ప కాలిక రుణాలు తీసుకుంటుంటారు. శాలరీ లోన్‌తో పాటు కొన్ని వాయిదాల్లో చెల్లించేలా కూడా తమ ఉద్యోగులకు రుణాలు ఇస్తుంటాయి కంపెనీలు. వీటిపై ఎలాంటి వడ్డీ ఉండదు. కాని పన్నుల శాఖ మాత్రం అలాంటి రుణాలపై కూడా వడ్డీ చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఓ ప్రైవేట్‌ కంపెనీ ఉద్యోగి కేసుకు సంబంధించిన తీర్పులో ట్యాక్స్‌ అపిలేట్‌ ట్రైబ్యూనల్‌ (ఐటీఏటీ) ఈ తీర్పు ఇచ్చింది. దిగువ కోర్టుల్లో తీర్పు తనకు అనుకూలంగా రాకపోవడంతో సదరు ఉద్యోగి ఐటీఏటీని ఆశ్రయించినా... ఫలితం లేకపోయింది. వడ్డీ లేని రుణాలు ఇచ్చినా... వాటిని కంపెనీ ఇచ్చిన ప్రయోజనంగా భావించి... దానిపై పన్ను చెల్లించాల్సిందేనని ట్రైబ్యూనల్‌ పేర్కొంది. ఏటా ఏప్రిల్‌ 1వ తేదీన ఎస్‌బీఐ తన ఖాతాదారులకు ఎంత వడ్డీ వసూలు చేస్తుందో... ఆ రేటుతో వడ్డీ లెక్కించి.. అలా పొందిన ప్రయోజనంపై పన్ను విధించాల్సిందిగా ట్రైబ్యూనల్‌ పేర్కొంది.