డాక్టర్ నిర్లక్ష్యం.. కడుపులో కత్తెర..

డాక్టర్ నిర్లక్ష్యం.. కడుపులో కత్తెర..

నిమ్స్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్షం మరోసారి బయటపడింది. ఓ పేషంట్‌కు ఆపరేషన్ చేసిన వైద్యులు.. కడుపులో కత్తెర మరిచిపోయి కుట్లు వేశారు. మూడు నెలల క్రితం పంజాగుట్టలోని నిమ్స్ లో హెర్నియా ఆపరేషన్ చేయించుకుంది మహేశ్వరి అనే మహిళ.. అయితే ఆపరేషన్ తర్వాత మహేశ్వరి పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. తీవ్రంగా ఇబ్బంది పడుతుండడంతో ఆమెకు ఎక్స్‌రే తీశారు. ఎక్స్‌రేలో కడుపులో కత్తెర కనిపించడం చూసి షాక్‌కు గురయ్యారు. కడుపులో కత్తెర ఉన్నట్టు ఎక్స్‌రేలో స్పష్టంగా కనిపిస్తోంది. డాక్టర్ల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పేషంట్ బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో మరోసారి సర్జరీ చేసి.. కడుపులోని కత్తెర బయటకు తీస్తామని చెప్పారు నిమ్స్ వైద్యులు.