ప్రియుడి తీరుతోనే ఝాన్సీ ఆత్మహత్య

ప్రియుడి తీరుతోనే ఝాన్సీ ఆత్మహత్య

టీవీ నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ప్రియుడు సూర్య ఆమెకు షరతులు పెట్టినట్లు విచారణలో పోలీసుల విచారణలో తేలింది. నాగ ఝాన్సీ షూటింగ్ లకు వెళ్లడం.. అక్కడ సహచర నటులతో ఆమె కలుపుగోలుగా మాట్లాడడాన్ని సహించలేకపోయేవాడు. ఆమెపై ఎప్పుడు అనుమానంతో రగిలిపోయేవాడు. సీరియల్స్ లో నటించడం మానుకో.. ఎవరితోనూ మాట్లాడవద్దు అంటూ షరతులు పెట్టేవాడు. తాను చెప్పింది వినాలంటూ సూర్య ఆమె పై వత్తిడి తెచ్చాడు. కొన్ని సందర్భాల్లో అతడి మాట వినకుండా ఆమె షూటింగ్ లకు వెళ్లేది. ఈ పరిణామాలు సూర్యకు ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఆమె ఫోన్ కాల్స్ తగ్గించాడు. మెసేజ్ లకు బదులు ఇచ్చేవాడు కాదు. తన నంబర్లు బ్లాక్ చేశాడు. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి, సర్వస్వం అనుకున్న నాగ ఝాన్సీని కలిచివేసింది. ఆమె ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాయి. ఈ కేసు విచారణలో పోలీసులు కీలక ఆధారాలు సంపాదించారు. ఝాన్సీ ఆత్మహత్యకు సూర్యే కారణమంటూ ఆమె తల్లి సంపూర్ణ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సూర్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.