గడ్డం లుక్ లో కనిపిస్తాడా ?

గడ్డం లుక్ లో కనిపిస్తాడా ?

మహేష్ బాబు తాజాగానే భరత్ అనే నేను సినిమాతో మంచి హిట్ సాధించారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను బాగా అలరించింది. ఇక మహేష్ తన నెక్స్ట్ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. మాములుగా మహేష్ లుక్ చాలా సింపుల్ గా బయట ఎలా ఉంటారో..సినిమాలోనే అలానే కనిపిస్తారు. కానీ త్వరలో చేయనున్న ఈ సినిమాలో గడ్డం, మీసాలతో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 

ఇదే విషయాన్ని మహేష్.. మొన్న భరత్ అనే నేను ప్రమోషన్స్ కార్యక్రమాల్లో కూడా వెల్లడించారు. మరి ఈ కొత్త లుక్ తో ఎంతసేపు కనిపిస్తారో లేదా సినిమా మొత్తం ఇలాగే ఉంటారా అన్నది తెలియాలి. ఈ సినిమా మహేష్ కెరియర్ లో 25వ సినిమా కావడంతో మంచి అంచనాలు ఆరంభం నుండే ఏర్పడ్డాయి. ఇటు భరత్ అనే నేనులో ఓ పాటలో కొద్దీ సేపు మీసాలతో కనిపించి అలరించారు మహేష్. రాయలసీమ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కనున్న ఈ చిత్రం జూన్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. పూజ హెగ్డే హీరోయిన్ నటించనుండగా, దిల్ రాజు మరియు అశ్వనీ దత్ లు సంయుక్తంగా నిర్మించనున్నారు.