2వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం

2వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం

వచ్చేనెల 2వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమలు చేస్తామని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు... రైతు బంధు పథకం ప్రారంభం సందర్భంగా హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... రైతుబంధు పథకంతో దేశానికే తెలంగాణ దిక్సూచిగా మారిందన్నారు. జూన్ 2 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమలు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించిన తెలంగాణ సీఎం... సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులు పోను మిగతా 430 మండలాల్లో ఎమ్మార్వోలే భూములు రిజిస్ట్రేషన్ చేస్తారని తెలిపారు. పోస్టులోనే రిజిస్ట్రేషన్ కాగితాలు, పాస్‌బుక్కులు ఇంటికొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. భూరికార్డుల ప్రక్షాళన అనుకున్న స్థాయికంటే మెరుగ్గా చేశామన్న కేసీఆర్... 58 లక్షల మంది రైతులకు పాస్‌ పుస్తకాలు, పంట సాయం అందిస్తున్నామన్నారు.