కుషాయిగూడ కార్ల చీటింగ్ కేసులో కొత్త ట్విస్ట్

కుషాయిగూడ కార్ల చీటింగ్ కేసులో కొత్త ట్విస్ట్

కుషాయిగూడ కార్ల చీటింగ్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. హైదరాబాద్ పోలీసులకు ఈ కేసు ముచ్చెమటలు పట్టిస్తుంది. ఈ కేసులో ఎలా ముందుకు పోవాలో అంతు దొరకక పోలీసులు లబోదిబోమంటున్నారు. తమకు క్లారిటీ ఇవ్వండి మొర్రో అంటూ ఫొరెన్సిక్ డాక్టర్లను పోలీసులు వేడుకుంటున్నారు. కార్ల చీటింగ్ కేసులో ఈ నెల 3న పోతులయ్య, సయ్యద్ సిరాజ్ హుస్సేన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సయ్యద్ ఆడా మగ తెలియక కుషాయిగూడ పోలీసులు గందరగోళంలో పడ్డారు. కేసు విచారణలో భాగంగా మగ మనిషిగా భావించి పోలీసులు నిందితుడిగా పరిగణించారు. కేసు డైరీ నమోదు సమయంలో జెండర్ కాలమ్ నింపే సమయంలో తాను ఆడపిల్లనని సయ్యద్ చెప్పడంతో పోలీసులు కంగుతున్నారు. 
మూడేళ్ల క్రితం ముంబాయిలో లింగ మార్పిడి చేయించుకున్నానని సయ్యద్ చెప్పడంతో పోలీసులు డైలమాలో పడ్డారు. తన పేరు షాభిన అస్మి అని, కరీంనగర్ జిల్లా ఫతేపూర్ గ్రామానికి చెందిన అమ్మాయినని పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చాడు. కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేసింది ఆడామగ తెలియక లింగ నిర్ధారణ కోసం గాంధీ ఆసుపత్రికి లేఖ రాశారు. షాభిన అస్మి అలియాస్ సయ్యద్ సిరాజ్ హుస్సేన్‌కు వైద్య పరీక్షలు జరిపి నివేదిక ఇవ్వాలని పోలీసులు కోరారు. వైద్యుల నివేదికను బట్టి ఆడా లేదా మగ అనే దానిపై స్పష్టత రానుంది. నివేదిక ఆధారంగా జెండర్ కాలమ్ నింపనున్నారు. వైద్యుల నివేదికతోనే చీటింగ్ కేస్ తెరపడనుంది.మొత్తానికి నేరస్తులు, నిందితులను చెడుగుడు ఆడుకునే పోలీసులకు ఈ వ్యక్తి చుక్కలు చూపిస్తున్నాడని టాక్ మొదలైంది.