టీమిండియా ఖాతాలో చెత్త రికార్డు

టీమిండియా ఖాతాలో చెత్త రికార్డు

వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘోర పరాజయంను ఎదుర్కొంది. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19.2 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆతిధ్య న్యూజిలాండ్ జట్టు 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే టీమిండియా టీ20ల్లో ఇప్పటివరకూ ఇన్ని పరుగుల తేడాతో ఓడిపోలేదు. చివరిసారిగా 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో ఓడింది. ఇప్పటివరకు ఇదే భారీ ఓటమి కాగా.. ఈ రోజు జరిగిన తొలి టీ20లో 80 పరుగుల తేడాతో ఓడి ఆ  రికార్డును అధిగమించింది. దీంతో టీమిండియా ఖాతాలో చెత్త రికార్డు చేరింది.