ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా

ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వ‌న్డేల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న భారత్ మరో సమరానికి సిద్దమయింది. న్యూజిలాండ్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం వెస్ట్‌ప్యాక్  స్టేడియంలో మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ టీ20 మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు మైదానంలో శ్రమిస్తున్నారు. వ‌న్డే సిరీస్ అనంతరం దొరికిన రెండు రోజుల సమయాన్ని భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ కు కేటాయించారు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, విజయ్ శంకర్ లు మైదానంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. దినేష్ కార్తీక్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసాడు. మరోవైపు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వెరైటీ షాట్లతో నెట్స్‌లో ప్రాక్టీస్ చేసాడు. వీరితో పాటు మరికొందరు ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబందించిన ఫొటోలు, వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌లో పోస్ట్ చేసింది.